నకిలీ ఫెర్టిలైజర్ ఫ్రాంచైజీ గ్యాంగ్ అరెస్ట్ – రూ. 3.5 కోట్ల మోసం బయటకు
నకిలీ ఫెర్టిలైజర్ ఫ్రాంచైజీ గ్యాంగ్ అరెస్ట్ – రూ. 3.5 కోట్ల మోసం బయటకు
fraud


ఆదిలాబాద్, 22 ఆగస్టు (హి.స.)

నకిలీ వెబ్‌సైట్‌లను సృష్టించి ప్రముఖ ఫెర్టిలైజర్ (ఎరువుల) కంపెనీల ఫ్రాంచైజీలు ఇస్తామంటూ దేశవ్యాప్తంగా వందలాది మందిని మోసం చేసిన అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అత్యంత చాకచక్యంగా అరెస్ట్ చేశారు. బీహార్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ ఐదుగురు సభ్యుల ముఠా, అమాయక రైతులు మరియు వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని ఈ భారీ స్కామ్‌కు తెరలేపింది. ఆదిలాబాద్ జిల్లా మందగడ గ్రామానికి చెందిన గణేష్ అనే రైతు ఈ నకిలీ ఫ్రాంచైజీ నమ్మి రూ. 3.85 లక్షలు కోల్పోవడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితులను పట్టుకున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ ముఠా దేశవ్యాప్తంగా దాదాపు 498 సైబర్ నేరాలకు (ఒక్క తెలంగాణలోనే 90 కేసులు) పాల్పడినట్లు తేలింది. వీరి వద్ద నుండి 10 అత్యాధునిక మొబైల్ ఫోన్లు, రూ. 70,000 నగదు మరియు మోసాలకు ఉపయోగించిన బ్యాంక్ ఖాతాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గ్యాంగ్ మొత్తం మీద రూ. 3.5 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు ఆదిలాబాద్ ఎస్పీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇంటర్నెట్‌లో వచ్చే ఇలాంటి నకిలీ ఫ్రాంచైజీ ప్రకటనలను నమ్మి బ్యాంక్ ఖాతాలకు డబ్బులు బదిలీ చేయవద్దని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులను ఆశ్రయించాలని ఆయన ప్రజలకు సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande