జన్నారంలో ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
జన్నారంలో ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి
జన్నారంలో ఏసీబీకి చిక్కిన పంచాయతీ కార్యదర్శి


మంచిర్యాల: , 22 ఆగస్టు (హి.స.)

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం లింగాయిపల్లిలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన ఆకస్మిక దాడిలో ఒక ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఒక అధికారిక పనికి సంబంధించిన సర్టిఫికెట్ జారీ చేయడం కోసం లింగాయిపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న జె. వరలక్ష్మి అనే మహిళా అధికారి బాధితుడి నుండి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేశారు. చివరకు రూ. 13,000 ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినప్పటికీ, ఆమె తీసుకున్న ఒక వినూత్న నిర్ణయం ఆమెను బుక్ చేసింది.

పట్టుబడకుండా ఉండేందుకు కార్యదర్శి వరలక్ష్మి సదరు లంచం డబ్బును నగదు రూపంలో కాకుండా, మరొక వ్యక్తికి చెందిన మొబైల్ నంబర్‌కు యూపీఐ (UPI) ద్వారా డిజిటల్ ట్రాన్స్‌ఫర్ చేయాల్సిందిగా బాధితుడిని ఆదేశించారు. అయితే, ముందే ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితుడు, వారి సూచనల మేరకే ఆన్‌లైన్ పేమెంట్ పూర్తి చేశారు. డిజిటల్ లావాదేవీ విజయవంతం కాగానే రంగంలోకి దిగిన ఏసీబీ బృందం, ఆ డిజిటల్ రికార్డులు మరియు స్క్రీన్ షాట్ల ఆధారంగా పంచాయతీ కార్యదర్శిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande