ఆ తేదీన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ ఎంట్రీ?
బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
on-that-date-vishwanath-and-sons-ott-release-5801


ముంబై, 24 ఆగస్టు (హి.స.) సూర్య, మమిత బైజు జంటగా నటించిన చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాధిక శరత్ కుమార్, సూర్యకు తల్లి పాత్రలో నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. నాగవంశీ ఈ మూవీని నిర్మించారు. ఆగస్టు 14న భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ను సొంతం చేసుకుని ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం కూడా డీసెంట్ కలెక్షన్లను రాబడుతోంది. ఇక కొంతమంది ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అలాంటి వారి కోసం ఓ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన నెల రోజులకు ఓటీటీలోకి రానున్నట్లు ఒప్పందం కుదిరినట్లు సమాచారం. దీంతో సెప్టెంబర్ 14వ తేదీన ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లను రాబడుతున్న ఈ చిత్రం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏ స్థాయిలో ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande