
నెల్లూరు, 31 ఆగస్టు (హి.స.)
నగరంలోని ఆర్టీవో కార్యాలయం సమీపంలో రౌడీ షీటర్ లక్ష్మీశెట్టి సాయితేజ ఆదివారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యపై సమాచారం అందుకున్న డీఎస్పీలు గిరిధర్, జీ శ్రీనివాసరావులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
అయితే సాయితేజను రాళ్లతో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. బీవీ నగర్కు చెందిన రౌడీషీటర్తోపాటు పలువురిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక రౌడీషీటర్ సాయితేజ.. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో కన్న తల్లిని దారుణంగా హత్య చేశాడు. ఈ నేపథ్యంలో అతడిపై పోలీసులు పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. జైలుకు పంపారు. ఇటీవలే అతడు జైలు నుంచి విడుదలయ్యాడని పోలీసులు వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ