అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే వీసాలను తగ్గించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా దేశం అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే వీసాలను తగ్గించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నేపాల్, ఇండియా స్టూడెంట్ల వీసాలను ఆస్ట్రేలియా అత్యధిక స్థాయిలో తిరస్కరించింది.
Australia visa


ఢిల్లీ , 11 సెప్టెంబర్ (హి.స.)ఆస్ట్రేలియా దేశం అంతర్జాతీయ విద్యార్థులకు జారీ చేసే వీసాలను తగ్గించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నేపాల్, ఇండియా స్టూడెంట్ల వీసాలను ఆస్ట్రేలియా అత్యధిక స్థాయిలో తిరస్కరించింది. నేపాల్కు చెందిన 51 శాతం మంది విద్యార్థులను వీసాలను, భారత్కు చెందిన 40 శాతం మంది విద్యార్థులను వీసాలను తిరస్కరించినట్లు తెలుస్తోంది.

గడిచిన పదేళ్లలో స్టూడెంట్ వీసాల తిరస్కరించిన రేటు తారా స్థాయికి చేరినట్లు తెలుస్తోంది. ఆ దేశ హోంశాఖ డేటా ప్రకారం 2026 జూన్లో 24.2 శాతం మేర స్టూడెంట్ వీసాలను ఆస్ట్రేలియా తిరస్కరించినట్లు తెలిసింది. 2016 జూన్లో 7.9 శాతంగా ఉన్న తిరస్కరణ రేటు.. ఇక 2026 జూన్ వరకు అత్యధిక స్థాయికి చేరినట్లు ప్రభుత్వ డేటా ద్వారా వెల్లడైంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande