ఢిల్లీ చేరుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కేవీ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పుతిన్కు స్వాగతం పలికారు.
Russian


ఢిల్లీ , 11 సెప్టెంబర్ (హి.స.)రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కేవీ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పుతిన్కు స్వాగతం పలికారు. పుతిన్ తన పర్యటన సందర్బంగా ప్రధాని మోదీతో శుక్రవారం భేటీ కానున్నారు. రష్యా-ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాల పెంపునకు, సహకారానికి, రక్షణ, ఎనర్జీ, టెక్నాలజీ, ఫార్మా, వ్యాపారం, వాణిజ్యం వంటి రంగాలపై చర్చలు జరుపుతారు. మోదీ, పుతిన్ చర్చల అనంతరం కీలక ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. ప్రధానంగా ఇరు దేశాల మధ్య చెల్లింపులకు సంబంధించిన మెకానిజం, సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. శనివారం నుంచి అధికారికంగా బ్రిక్స్ సదస్సు ప్రారంభమవుతుంది. ఈ సదస్సుకు చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామాఫోసా, ఇండోనేసియా అధ్యక్షుడు ప్రాబోవో సుబియాంటో, ఈజిప్టియన్ అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తాహ్ ఎల్ సిసి, మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహిం, అబుదాబి రాజు ప్రిన్స్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇథియోపియన్ ప్రధాని అబియ్ అహ్మద్ అలి, వియత్నం ప్రధాని లె మిన్స్ హుంగ్ వంటి నేతలు హాజరుకానున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande