సాఫ్ట్వేర్ ఉద్యోగులకి షాక్ ఇచ్చిన ఒరాకిల్
సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ షాక్ ఇచ్చింది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు పేర్కొంది.
Job reduction


ఢిల్లీ , 15 సెప్టెంబర్ (హి.స.)సాఫ్ట్వేర్ ఉద్యోగులకి ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ షాక్ ఇచ్చింది. కంపెనీ పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా ఈ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు పేర్కొంది. తాజా లేఆఫ్లో ఉద్యోగాలు కోల్పోయిన పలువురు ఉద్యోగులు తమ అనుభవాలను లింక్డ్ఇన్, రెడిట్, బ్లైండ్ వంటి ప్లాట్ఫామ్లలో పంచుకున్నారు. లేఆఫ్స్లో ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే విషయాన్ని ఒరాకిల్ అధికారికంగా వెల్లడించలేదు.

ఇవాళ ఉదయం 6 గంటల నుంచే ఉద్యోగులకు ఒరాకిల్ సంస్థ మెయిల్స్ పంపడం ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపింది. ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను పరిగణనలోకి తీసుకుని సంస్థలో విస్తృత పునర్వ్యవస్థీకరణ చేపడుతున్నామని, అందులో భాగంగా సంబంధిత ఉద్యోగుల పోస్టులను తొలగించినట్లు ఈమెయిల్లో పేర్కొన్నట్లు సమాచారం. ఉద్యోగులకు వారి సేవలకు, కృషికి కృతజ్ఞతలు తెలిపిన అనంతరం.. టెర్మినేషన్ పత్రాలపై సంతకం చేసిన తర్వాత కంపెనీ సెవరెన్స్ ప్లాన్ నిబంధనలకు లోబడి పరిహారం అందుతుందని వివరించినట్లు సమాచారం.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande