
ఢిల్లీ , 15 సెప్టెంబర్ (హి.స.)దేశంలో కోర్టులు, న్యాయ వ్యవస్థకు సంబంధించిన తీర్పులను విమర్శించడంపై సుప్రీంకోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల త్రిసభ్య ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
గతంలో కోర్టుల తీర్పులను లేదా న్యాయ వ్యవస్థను విమర్శించాలంటే ప్రజలు, రాజకీయ నాయకులు భయపడేవారు. కోర్టు ధిక్కరణ అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందన్నదే ఆ భయం. అయితే కాలక్రమేణా రాజకీయ పరిస్థితులు మారుతున్న కొద్దీ కోర్టు తీర్పులపై బహిరంగ చర్చలు, విమర్శలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం విమర్శల సరిహద్దులపై క్లారిటీ ఇచ్చింది. న్యాయ వ్యవస్థలో తప్పులను ఎత్తిచూపడం, విమర్శించడం తప్పు కాదు కానీ, కానీ కోర్టులు పూర్తిగా అవినీతిమయమయ్యాయని భావి తరాలకు, విద్యార్థులకు బోధించడం సరైనది కాదని ధర్మాసనం పేర్కొంది. జడ్జీలు ఎవరూ సాధువులు కారని, అయితే వ్యవస్థలోని లోపాలను, వ్యక్తుల తప్పులను వేరు వేరుగా చూడాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. న్యాయమూర్తులు కూడా సాధారణ మనుషులేననీ, వ్యవస్థపై విమర్శలు అవసరమే అయినప్పటికీ, మొత్తం వ్యవస్థే అవినీతిమయంగా మారిందని చెప్పడం సరికాదని సర్వోన్నత ధర్మాసనం స్పష్టత ఇచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్