రేలంగిలో రైతుల నిరసన
ఇరగవరం మండలం రేలంగిలో బుధవారం పలువురు రైతులు నిరసనకు దిగారు.
రేలంగిలో  రైతుల నిరసన


అమరావతి, 16 సెప్టెంబర్ (హి.స.)

ఇరగవరం మండలం రేలంగిలో బుధవారం పలువురు రైతులు నిరసనకు దిగారు. 50 ఏళ్లకు పైగా సాగు చేసుకుంటున్న తమ భూములను శ్రీతాటకేశ్వర అండ్ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం భూమలు ఆక్రమించారంటూ ఆలయ ఈవో సూర్యనారాయణ నోటీసులు జారీ చేశారని రైతులు పేర్కొన్నారు.

నోటీసులకు 7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని చెప్పారని, తాము సమాధానం ఇవ్వడానికి వస్తే ఈవో తీసుకోలేదని రైతులు వాపోయారు. నోటీసులకు సమాధానం ఇస్తే ఎందుకు తీసుకోరని రైతులు నిరసనకు దిగారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande