ప్రధాని మోదీకి తెలంగాణ గవర్నర్ జన్మదిన శుభాకాంక్షలు
ఈ నెల 17 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.
Governor


ఆంధ్రప్రదేశ్ , 16 సెప్టెంబర్ (హి.స.)ఈ నెల 17 వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున, తన తరఫున ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ప్రధాని నరేంద్ర మోదీకి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం, బలం, దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

ప్రధాని మోదీ సమర్థవంతమైన, దార్శనిక నాయకత్వంలో భారత్ అభివృద్ధి, ప్రగతి, సుసంపన్నత వైపు మరింత వేగంగా ముందుకు సాగాలని గవర్నర్ ఆకాంక్షించారు. దేశ సేవలో ప్రధాని మరిన్ని సంవత్సరాలు అంకితభావంతో కొనసాగాలని శుభాకాంక్షలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande