ఎస్వీ మ్యూజియంను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
తిరుమలలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Sv museum


ఆంధ్రప్రదేశ్ , 16 సెప్టెంబర్ (హి.స.)తిరుమలలో ఏర్పాటు చేసిన ఎస్వీ మ్యూజియంను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. శ్రీవారి మహత్యం, తిరుమల విశిష్టతలను భక్తులకు తెలియజేసేలా మ్యూజియంలో అనేక ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణదేవరాయలు సహా పలువురు రాజులు, భక్తులు వివిధ సందర్భాల్లో శ్రీవారికి సమర్పించిన ఆభరణాల నమూనాలతో పాటు చారిత్రక అంశాలను తెలిపే వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. శ్రీవారికి అలంకరించే వివిధ రకాల కిరీటాలు, ఆభరణాలను త్రీడీ మోడళ్ల రూపంలో అందుబాటులో ఉంచారు.

పానోరమిక్ స్క్రీన్పై ఏఐ సాంకేతికతతో రూపొందించిన వీడియో ద్వారా శ్రీవారి పరిణయ విశేషాలను ప్రదర్శిస్తున్నారు. చరిత్ర, ఆధ్యాత్మికత, ఆధునిక సాంకేతికతను మేళవిస్తూ రూపొందించిన ఈ మ్యూజియం.. భక్తులకు తిరుమల వైభవాన్ని మరింత దగ్గరగా పరిచయం చేసేలా తీర్చిదిద్దారు. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande