రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం....నలుగురు మృతి
రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో జైపూర్-ఫలోడి మెగా హైవేపై నేటి తెల్లవారుజామున డంపర్, స్విఫ్ట్ డిజైర్ కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు.
రోడ్డు ప్రమాదం


రాజస్థాన్, 16 సెప్టెంబర్ (హి.స.)

రాజస్థాన్లోని జైపూర్ జిల్లాలో జైపూర్-ఫలోడి మెగా హైవేపై నేటి తెల్లవారుజామున డంపర్, స్విఫ్ట్ డిజైర్ కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో నలుగురు మరణించారు.

అతి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీని బలంగా ఢీ కొనడంతో నలుగురు వ్యక్తులు ఘటనా స్థలంలోనే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయి లారీ కిందకు దూసుకుపోయింది. దీంతో అందులోని ప్రయాణికులు తీవ్ర గాయాలతో వాహనం లోపలే ఇరుక్కుపోయి ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. నుజ్జునుజ్జయిన కారు శకలాలను గ్యాస్ కట్టర్ల సాయంతో తొలగించి, లోపల ఇరుక్కుపోయిన మృతదేహాలను అతికష్టం మీద వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande