
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జోగుళాంబ గద్వాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బందితో పాటు జిల్లా ప్రజలకు ప్రజా పాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ పోలో అనంతరం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారత యూనియన్లో విలీనమైందని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు