నిజాం పాలన నుంచి విముక్తి కలిగిన చారిత్రక రోజు.. నేరెళ్ల శారద
ప్రజలకి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు.
Women's commission


కామారెడ్డి, 17 సెప్టెంబర్ (హి.స.)

ప్రజలకి సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద అన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం కామారెడ్డి కలెక్టరేట్ లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన నేరెళ్ల శారదకు కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేష్ చంద్ర పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.

పోలీసుల గౌరవ వందనం అనంతరం ఆమె జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరవీరుల స్తూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా నేరెళ్ల శారద మాట్లాడుతూ.....నిజాం పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు పరివర్తన చెందిన చారిత్రక రోజు ఇదని, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande