
అనంతపురం, 17 సెప్టెంబర్ (హి.స.)ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా మరియు దేశవ్యాప్తంగా పరిశుభ్రతపై అవగాహన కల్పించేందుకు 'స్వచ్ఛతా హీ సేవా' (Swachhata Hi Seva) కార్యక్రమం ,ర్యాలీలు నిర్వహించనున్నారు.
అందులో భాగంగా అనంతపురం గాంధీచౌక్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్నిఅనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రారంభించారు.
ఈనెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నిర్వహించే స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో ప్రజలందరూ భాగ స్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించి పరిసరాల పరిశుభ్రత కార్యక్రమంలో అందరూ భాగస్వాముల కావాలని కోరారు.ప్లాస్టిక్ రహిత, పరిశుభ్రమైన నగరమే మా లక్ష్యమని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నిర్వహించిన 'స్వచ్ఛతా హి సేవా' ర్యాలీలో ఆయన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి పాల్గొన్నారు. పరిశుభ్రతపై టవర్ క్లాక్ వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్, వికసిత భారత్ లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి మోదీ జన్మదినం సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.ప్రతి ఒక్కరూ నా ఇల్లు, నా వీధి, నా నగరం, నా రాష్ట్రం, నా దేశం పరిశుభ్రంగా ఉండాలనుకుంటేనే స్వచ్ఛ భారత్ సాధ్యమని ఎమ్మెల్యే దగ్గుపాటి అన్నారు. మరోవైపు ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాలు గ్రామస్థాయి నుంచి జరుగుతాయని.. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV