
నంద్యాల, 17 సెప్టెంబర్ (హి.స.) నంద్యాల జిల్లా అవుకు మండలం రామాపురంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జీఎన్ఎస్ఎస్ కాలువలో పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు.
సరదాగా కాలువ వద్దకు వెళ్లిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులు.. ప్రమాదవశాత్తు నీటిలో పడ్డ 6 ఏళ్ల బాలుడు.గత రాత్రి ఈ ప్రమాదం జరగ్గా ఇప్పటి వరకు గల్లంతైనవారి ఆచూకీ లభించలేదు.
ప్రమాదవశాత్తు 6 ఏళ్ల బాలుడు ఆరిష్ నీటిలో పడటంతో కుమారుడిని రక్షించేందుకు దూకిన తండ్రి అఫ్రోజ్, అఫ్రోజ్ బావమరిది ఆసిఫ్ సైతం కాలువలో దూకేశారు. నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కొట్టుకుపోయినట్లు సమాచారం.
పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఘటనస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపడతున్నారు. గాలింపు చర్యలకు పోలీసులు ఫైర్ సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ సాయం కోరారు. ఒకే ఇంట్లో ముగ్గురు నీటిలో గల్లంతవ్వడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV