అమెరికాలో హైదరాబాద్ యువకుడి మృతి
అమెరికాలో తెలంగాణకు చెందిన 28 ఏళ్ల యువకుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందాడు.
Hyderabad youth


హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.) అమెరికాలో తెలంగాణ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పెళ్లైన 17 రోజులకే మృతిచెందడం సంచలనంగా మారింది. మసాచుసెట్స్లోని లోవెల్లో హైదరాబాద్కు చెందిన సివిల్ ఇంజినీర్ మహమ్మద్ జాబెర్ హుస్సేన్(28) నివసిస్తున్నాడు.

సెప్టెంబర్ 14న కుటుంబ సభ్యులతో చివరిసారిగా అతను ఫోన్లో మాట్లాడాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే జాబెర్ తన గదిలో నిద్రలోనే మృతిచెందినట్లు అతని రూమ్మేట్ బాధిత కుటుంబానికి సమాచారం ఇచ్చాడు. దీంతో ఆ కుటుంబంలో పెను విషాదం నెలకొంది.

అయితే, జాబెర్ మృతికి గల కచ్చితమైన కారణాలపై స్పష్టత రాలేదు. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్కు జాబెర్ తండ్రి లేఖ రాశారు. అమెరికాలోని భారత దౌత్య కార్యాలయం, స్థానిక అధికారులతో సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి జైశంకర్ తక్షణమే జోక్యం చేసుకుని జాబెర్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని ఎక్స్లో పోస్టు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande