
తిరుమల, 17 సెప్టెంబర్ (హి.స.) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి క్షేత్రం లో వరుసగా రెండో రోజు భక్తుల రద్దీ సాధారణంగా కొనసాగుతోంది.
తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 15 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు.
ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కేవలం 4 కంపార్ట్మెంట్లలో మాత్రమే భక్తులు వేచి ఉన్నారు. దీంతో ఎలాంటి టైమ్ స్లాట్ లేదా దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు శ్రీవారి సర్వదర్శనం సుమారు 4 గంటల వ్యవధిలోనే పూర్తవుతోందని టీటీడీ అధికారులు వెల్లడించారు. క్యూలైన్లలో ఎలాంటి తోపులాటలు లేకుండా భక్తులు సజావుగా సాగిపోతుండటంతో వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గి స్వామివారి దర్శనం వేగంగా లభిస్తుంది.
మరోవైపు నిన్న ఒక్కరోజే మొత్తం 71,196 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 22,581 మంది భక్తులు కల్యాణ కట్ట లో తలనీలాలు సమర్పించి స్వామివారిపై తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV