పిఠాపురంలో రూ.1,500 కోట్ల అభివృద్ధి పనులకు కార్యాచరణ
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Pavan kalyan


అమరావతి , 20 సెప్టెంబర్ (హి.స.)డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో రెండు రోజుల పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో సుమారు రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టనున్నారు.

పిఠాపురం ప్రాంతంలో తాగునీరు, రహదారులు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.. సెప్టెంబర్ 21న నాగులపల్లి సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని పునరుద్ధరించిన అనంతరం ప్రజలకు అంకితం చేయనున్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమైనఅంశం,. వేసవి కాలంలోనే కాకుండా సాధారణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉండేందుకు శాశ్వత మౌలిక సదుపాయాలు అవసరం. ఈ నేపథ్యంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు గ్రామీణ ప్రాంతాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. పిఠాపురం ప్రాంతంలో చేపట్టే అభివృద్ధి పనులు పూర్తయితే స్థానిక ప్రజలకు రహదారులు, తాగునీరు, ఇతర పౌర సదుపాయాల విషయంలో ప్రయోజనం కలుగుతుంది..

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande