వెల్లివిరిసిన మతసామరస్యం.. వేలంపాటలో లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో చాందిని, మస్తాన్ వలి అనే ముస్లిం దంపతులు రూ.1,45,000 చెల్లించి ప్రసాదాన్ని కైవసం చేసుకున్న
వెల్లివిరిసిన మతసామరస్యం.. వినాయక లడ్డూను దక్కించుకున్న ముస్లిం దంపతులుs


ధర్మవరం, 20 సెప్టెంబర్ (హి.స.) శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఒక అరుదైన సంఘటన చోటుచేసుకుంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన లడ్డూ వేలంపాటలో చాందిని, మస్తాన్ వలి అనే ముస్లిం దంపతులు రూ.1,45,000 చెల్లించి ప్రసాదాన్ని కైవసం చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రసాదాన్ని కైవసం చేసుకునేందుకు పలువురు భక్తులు తీవ్రంగా పోటీపడినప్పటికీ, చివరికి ఈ ముస్లిం దంపతులే అత్యధిక బిడ్తో విజేతలుగా నిలిచారు. కులమతాలకు అతీతంగా వారు చూపించిన భక్తిభావానికి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. లడ్డూను గెలుచుకున్న చాందిని, మస్తాన్ వలి దంపతులను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించి, తమ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాల చివరలో గణనాథుని లడ్డూ ప్రసాదానికి వేలం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లోని బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట దేశవ్యాప్తంగా ఎంతటి ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande