సరికొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు..
సరికొత్త చరిత్ర సృష్టించిన భారత మహిళల క్రికెట్ జట్టు..
Woman cricket


హైదరాబాద్, 22 సెప్టెంబర్ (హి.స.) భారత మహిళా క్రికెట్ జట్టు సరికొత్త చరిత్రను సృష్టించింది. ఆసియా గేమ్స్ 2026 లో సంచలన విజయంతో మొదటి బంగారు పతకాన్ని సాధించింది. నిస్ప్రిన్లోని కోరోగీ స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరిగిన ఈ హైవోల్టేజ్ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 216 పరుగుల భారీ స్కోరును సాధించింది. భారత బ్యాటర్లు పరుగుల వరద పారించి లంక బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించారు.

అనంతరం 217 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మహిళల జట్టు భారత బౌలర్ల ధాటికి పేకమేడలా కుప్పకూలింది. ఏ దశలోనూ భారత బౌలింగ్ దాడికి ఎదురు నిలవలేకపోయిన లంక జట్టు 15.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే కుప్పకూలి చిత్తుగా ఓడిపోయింది. ఈ తిరుగులేని విజయంతో భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande