గణేశుడి రూపంలో దర్శనమిచ్చిన ఉజ్జయిని మహాకాళ్
గణేశుడి రూపంలో దర్శనమిచ్చిన ఉజ్జయిని మహాకాళ్
GANESH


ఉజ్జైని, 25 సెప్టెంబర్ (హి.స.)

ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జ్యోతిర్లింగ క్షేత్రం ఉజ్జైనిలో అనంత చతుర్థశి వేడుకలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ పవిత్రమైన పర్వదినాన్ని పురస్కరించుకుని మహాకాళేశ్వర స్వామికి అత్యంత ప్రత్యేకమైన, అరుదైన రీతిలో అలంకరణ చేశారు. అనంత చతుర్థశి ప్రత్యేకతను చాటుతూ సాక్షాత్తు వినాయకుడి (గణేశుడు) రూపంలో బాబా మహాకాల్ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గర్భగుడిలో కొలువైన మహాకాల్ ఈ రూపంలో దర్శనమివ్వడంతో ఉజ్జైని పులకించిపోయింది.

సాంప్రదాయం ప్రకారం ప్రతీ ఏటా అనంత చతుర్థశి నాడు మహాకాల్‌ను గణాధిపతి రూపంలో శృంగరించడం ఇక్కడి ప్రత్యేకత. ఈ వేడుకలో భాగంగా భగవానుడికి వెండితో చేసిన చంద్రుడు, త్రిశూలం మరియు మనోహరమైన కిరీటాన్ని అలంకరించారు. ఈ దివ్యమైన ఆభరణాలతో మహాకాల్ రూపం మరింత తేజోవంతంగా, కనువిందుగా మారింది. తెల్లవారుజామున నిర్వహించిన భస్మ హారతి సమయంలోనే భక్తులు ఈ అద్భుతమైన రూపాన్ని కనులారా వీక్షించి పరవశించిపోయారు.

భాద్రపద మాసంలో వచ్చే అనంత చతుర్థశి సందర్భంగా మహాకాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు. గణేశుని రూపంలో ఉన్న మహాకాల్‌ను దర్శించుకోవడం ద్వారా సమస్త కష్టాలు తొలగిపోయి, జీవితంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఉజ్జైని వీధులు 'జై మహాకాల్', 'గణపతి బప్పా మోరియా' నినాదాలతో మార్మోగుతుండటంతో ఆ ప్రాంతమంతా పవిత్ర ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande