
తెలంగాణ, 03 సెప్టెంబర్ (హి.స.) నేడు తెల్లవారుజామున సింగరేణి సంస్థ ఆర్జీ-3 ఏరియాలోని అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు (ఏపీఏ డివిజన్)లో ఎయిర్ ట్యాంకర్ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడినట్లు తెలిసింది.
నైట్ షిఫ్ట్ ముగింపు సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పనులు ముగించుకుని కార్మికులు బయటకు వస్తున్న సమయంలో ఎయిర్ ట్యాంకర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలినట్లు సమాచారం.
అక్కడి సిబ్బంది గాయపడిన వారిని బయటకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఐదుగురిని పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. ఎయిర్ ట్యాంకర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్