ఐకానిక్ భవనాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్..... ఏపీ ప్రభుత్వం శ్రీకారం
రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం
AP


అమరావతి, 03 సెప్టెంబర్ (హి.స.)

అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాలకు సెంట్రలైజ్డ్ కూలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దుబాయ్, సింగపూర్ వంటి అంతర్జాతీయస్థాయి నగరాల్లో కనిపించే ఈ అత్యాధునిక కూలింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేయడం ద్వారా అమరావతిని కూడా ఆ నగరాల సరసన నిలబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

అధునాతన డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రొసీజర్(డీసీపీ) ద్వారా ఐకానిక్ సెక్రటేరియట్ భవన సముదాయమైన జీఏడీ టవర్, 4 హెచ్వోడీ టవర్లు, సీఎం కార్యాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు ఏసీ సదుపాయాన్ని కల్పించనున్నారు. దీనికిగాను రూ.415 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande