
ఖమ్మం, 05 సెప్టెంబర్ (హి.స.) రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాలేరు పాత కాల్వ ద్వారా వెంటనే సాగునీటిని విడుదల చేయాలని అధికారులనురాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
మంత్రి ఆదేశాలతో పాలేరు పాత కాల్వ పరిధిలోని గ్రామాల రైతులకు సాగునీరు అందుబాటులోకి రానుంది. దీంతో వేలాది ఎకరాల్లోని పంటలకు నీరందే అవకాశం ఉండటంతో రైతులకు ఊరట కలగనుంది. సాగునీటి విడుదలకు ఆదేశాలు జారీ చేయడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు