ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆరా
నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో శనివారం నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.
Mla


నాగర్ కర్నూల్, 05 సెప్టెంబర్ (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్

మండలంలోని మాచారం గ్రామంలో శనివారం నిర్వహించిన మార్నింగ్ వాక్ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షులు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో కలిసి గ్రామంలో పర్యటిస్తూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ప్రధానంగా తాగునీటి సదుపాయం, డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సంబంధిత అధికారులు, గ్రామ సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు.

గ్రామాభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు మార్నింగ్ వాక్ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఎమ్మెల్యే వంశీకృష్ణ పేర్కొన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande