
తిరుమల 05 సెప్టెంబర్ (హి.స.) తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపి విరామ సమయంలో ఎమ్మెల్యేలు గోరుంట్ల బుచ్చయ్యచౌదరి, గంటా శ్రీనివాసరావు, మాజీమంత్రి దేవినేని ఉమా,సినీ నిర్మాత డీ.వీ.వీ.దానయ్య శ్రీవారిని దర్శించుకున్నారు.
టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV