బ్రిక్స్లో భారత్ కొత్త అజెండా
బ్రిక్స్లో భారత్ ప్రధానంగా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. భారత్, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో 18వ శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ఇంధనం, వాతావరణం, అంతర్జాతీయ పాలనలో మార్పులపై సదస్సులో కీల
PM modi


ఢిల్లీ , 08 సెప్టెంబర్ (హి.స.)బ్రిక్స్లో భారత్ ప్రధానంగా ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని చూస్తోంది. భారత్, సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో 18వ శిఖరాగ్ర సదస్సును నిర్వహించనుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, టెక్నాలజీ, ఇంధనం, వాతావరణం, అంతర్జాతీయ పాలనలో మార్పులపై సదస్సులో కీలక చర్చలు జరగనున్నాయి. అదే సమయంలో బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టెయినబిలిటీ అనే థీమ్ను భారత్ ఎంచుకుంది.

జాతీయ కరెన్సీల వినియోగాన్ని పెంచడం, సరిహద్దు చెల్లింపుల వ్యవస్థలను మరింత అనుసంధానం చేయడం వంటి అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి. ప్రపంచ వాణిజ్యంలో ఎదురవుతున్న భౌగోళిక, రాజకీయ సవాళ్ల నేపథ్యంలో సరఫరా గొలుసులను మరింత పటిష్ఠం చేయడం భారత్ అజెండాలో ముఖ్యమైన అంశంగా మారింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా బ్రిక్స్ సహకారం అందించాలనేది భారత్ లక్ష్యం.

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేగంగా మార్చుతున్న అంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒకటి. అందుకే బ్రిక్స్లో కూడా ఏఐ సహకారానికి భారత్ ప్రాధాన్యం ఇస్తోంది. ఏఐతో పాటు ఫిన్టెక్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా ఆధారిత వ్యవస్థలపై సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంచాలని భారత్ భావిస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande