
ఢిల్లీ , 08 సెప్టెంబర్ (హి.స.)పోలీసులు రైలుబోగీలో మద్యంతో ప్రయాణిస్తున్న మహిళ ను అరెస్టు చేశారు. ఏసీ ఫస్ట్ క్లాస్ రైలుబోగీలో సుమారు 75 లీటర్ల విదేశీ మద్యంతో ప్రయాణిస్తున్న 25 ఏళ్ల నేహా జాను పోలీసులు పట్టుకున్నారు.
బీహార్లోని సమస్తిపుర్ జంక్షన్లో ఆమెను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు వీడియో తీశారు. చాలా స్పష్టంగా ఆంగ్లభాషలో ఆమె మాట్లాడినట్లు పోలీసులు చెబుతున్నారు. కంపార్ట్మెంట్లో సెర్చ్ చేస్తున్నా.. ఆమె మాత్రం తన మొబైల్ను చూసుకుంటూ ఉండిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్