తెలంగాణ, కరీంనగర్. 1 అక్టోబర్ (హి.స.)
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు తెలిపారు. ఇవాళ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన... తొలుత జడ్పీటీసీ అభ్యర్థులను డిక్లేర్ చేస్తామన్నారు. వార్డు మెంబర్ నుండి జడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. బీఆర్ఎస్ కేంద్ర ఇచ్చిన నిధులను దారి మళ్లించి స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారని, తాజామాజీ సర్పంచులు పడిన యాతన వర్ణణాతీతం అన్నారు. కనీసం పంచాయతీలకు కరెంట్ బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి తెచ్చారని దుయ్యబట్టారు. ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు