రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.. స్వయంగా రంగంలోకి దిగిన ఆలయ ఈ.వో
తెలంగాణ, 1 అక్టోబర్ (హి.స.) దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. బతుకమ్మ, దసరా సెలవు దినాలు కావడంతో రాష్ట్రంలోనీ ఆయా ప్రాంతాల నుండి స్వామి వారి దర్శనానికి వేలాది సంఖ్యల
వేములవాడ


తెలంగాణ, 1 అక్టోబర్ (హి.స.)

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. బతుకమ్మ, దసరా సెలవు దినాలు కావడంతో రాష్ట్రంలోనీ ఆయా ప్రాంతాల నుండి స్వామి వారి దర్శనానికి వేలాది సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. గర్భాలయంలో భక్తులు కిక్కిరిసిపోవడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో ఆలయ ఈవో రమాదేవి స్వయంగా రంగంలోకి దిగి భక్తులకు త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు చేపట్టింది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande