హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.) . ‘‘ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రింట్స్ అమ్మిన తరువాత మీరు ఎం పట్టనట్టు కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ళ మీద కాకుండా మీ OTT రెవిన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.
1) హీరో లకు అంత రెమ్యూనిరేషన్ అవసరమా? అది మీ కొడుకు అయినా ఎవరు అయినా...
2) సినిమా ఇండస్ట్రీ లో చాలా మంది వున్నారు. వాళ్ళు ఎం అయిపోతారు అని కబుర్లు చెప్పకండి.. వాళ్ళకి మీరు ఇచ్చేఅమౌంట్ ఏ కూలి పని చేసిన వస్తాయి కానీ మీ హీరోకి హీరోయిన్ కి వస్తాయా.
3) సినిమా బడ్జెట్ లో ఎక్కువ శాతం రెమ్యూరురేషన్స్ మరియు విదేశాలలో షూటింగ్ లకు మరియు ట్రిప్స్ కి ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చుపెడుతున్నారు ? ఇండియా లో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది. కదా ? అక్కడ వాళ్ళకి ఉపాధి కలుగుతుంది కదా.
4) అనవసర బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికావెర్టీ కి దానిని మా మీద రుద్ది ఎక్కువకి అమ్ముతున్నారు, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసుకోవటానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతివాడే బాధపడుతున్నాడు.
మా వెబ్సైటు మీద ఫోకస్ చేయటం ఆపండి లేదంటే నేను మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది.
ఫస్ట్ వేరే కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్సైట్లు మీద మీ ద్రుష్టి పెట్టండి. ఇబొమ్మ అన్నది సిగేరేట్ నుంచి e -సిగిరెట్ కు యూజర్స్ ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్ కి నా రియాక్షన్ ఉంటుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు