తెలంగాణ, పెద్దపల్లి. 1 అక్టోబర్ (హి.స.)
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన స్ట్రాంగ్ రూంల విషయంలో సంబంధిత శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లను సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్ లో గల మదర్ థెరిస్సా ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూంల పరిస్థితిని బుధవారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో కలిసి మదర్ థెరిస్సా కళాశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లను చేసుకోవాలన్నారు. ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వ మార్గదర్శకాలు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు