ఆపరేషన్ లోకల్.. సీఎంతో పీసీసీ చీఫ్, మంత్రి పొన్నం కీలక భేటీ
హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.) స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై పోల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ రెండు ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై పార్టీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ
సీఎం రేవంత్ రెడ్డి


హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)

స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ బై పోల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ రెండు ఎన్నికల్లో అభ్యర్థుల ఖరారుపై పార్టీ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ అయ్యారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, బీసీ రిజర్వేషన్ల అంశంలో కోర్టు కేసు వంటి కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. జడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల పేర్ల జాబితాను అక్టోబర్ 5వ తేదీ నాటికి పీసీసీకి పంపించాలని మంత్రులు, డీసీసీ అధ్యక్షులకు నిన్న జూమ్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన భేటీలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు కేసు, తాజా పరిస్థితులపై అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande