నకిలీ వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు: డీజీపీ శివధర్ రెడ్డి
హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్ర 6వ డీజీపీగా బీ. శివధర్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. లక్షీకపూల్లోని డీజీపీ కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు సజా
డిజిపి


హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్ర 6వ డీజీపీగా బీ. శివధర్ రెడ్డి నేడు బాధ్యతలు స్వీకరించారు. లక్షీకపూల్లోని డీజీపీ కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను త్వరగా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతామని చెప్పారు. బేసిక్ పోలీసింగ్ సహాయంతో సమర్థంగా విధులు నిర్వహిస్తామని చెప్పారు. క్షేత్రస్థాయిలో సాంకేతికతను వినియోగించుకుంటామన్నారు. పోరాట మార్గం వీడేందుకు సిద్ధమని నక్సల్స్ నేత ఇటీవల లేఖ రాశారని, జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టులను కోరుతున్నామని చెప్పారు.

లొంగిపోయిన నక్సల్స్క అన్ని రకాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమాజాభివృద్ధిలో భాగం కావాలని మావోయిస్టులను కోరారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande