భద్రాచలం వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
తెలంగాణ, భద్రాచలం. 1 అక్టోబర్ (హి.స.) భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు 50 అడుగులకు చేరుకున్న గోదావరి, 7 గంటల వరకు నిలకడగా ప్రవహించి 8 గంటల నుండి శాంతించింది. బుధవారం ఉదయం 7:27 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48
భద్రాచలం గోదావరి


తెలంగాణ, భద్రాచలం. 1 అక్టోబర్ (హి.స.) భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు 50 అడుగులకు చేరుకున్న గోదావరి, 7 గంటల వరకు నిలకడగా ప్రవహించి 8 గంటల నుండి శాంతించింది. బుధవారం ఉదయం 7:27 గంటలకు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయి 48 అడుగులకు తగ్గి 47.90 అడుగుల మేర ప్రవహించడంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ రెండవ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాగా ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande