ప్రతిదీ రాజకీయం చేయొద్దు. కేటీఆర్కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్
హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.) ''ప్రతిదీ రాజకీయం చేయొద్దు'' అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూపైన మా
జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి


హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)

'ప్రతిదీ రాజకీయం చేయొద్దు' అంటూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూపైన మాట్లాడరా?, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్చగా మాట్లాడారా? అని ప్రశ్నించారు. తాను పోరాటం చేసేది రైతుల కోసం, జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం అని స్పష్టం చేశారు. మీ ఎమ్మెల్యేల మాదిరి తాను వసూళ్లు, కమీషన్స్, కబ్జాల కోసం పని చేయను అని కేటీఆర్ను జడ్చర్ల ఎమ్మెల్యే విమర్శించారు. ఈ మేరకు ఎక్స్లో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పోస్ట్ చేశారు.

'కేటీఆర్ గారు ప్రతిదీ రాజకీయం చేయొద్దు. మీ పార్టీలో ఒక్క ఎమ్మెల్యే అయినా ఏ రోజైనా తనకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడరా, తన ప్రజలకు కావాల్సిన అంశంపై ఏరోజైనా స్వేచ్చగా మాట్లాడారా?. మా పార్టీలో, మా ప్రభుత్వంలో స్వేచ్ఛ ఎక్కువ. మీ పాలన నిరంకుషత్వ పాలన. మీ రౌడీయిజం అరాచకత్వ పాలన చూడలేకనే ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని మిమ్మల్ని బొంద పెట్టారు. నేను పోరాటం చేసేది రైతుల కోసం, నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల కోసం. మీ ఎమ్మెల్యేల లాగా రౌడీయిజం చేసి ఫ్యాక్టరీల్లో వసూళ్ల కోసం, కమీషన్ల, భూకబ్జాల కోసం నేను పనిచేయనని మీరు గమనించాలి.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande