హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)
విజయదశమి సందర్భంగా దేశ ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రేపు విజయ దశమి అనే గొప్ప పండగను జరుపుకోబోతున్నామని.. అన్యాయంపై న్యాయం విజయం, అసత్యంపై సత్యం, చీకటిపై వెలుగు సాధించిన విషయంగా పేర్కొన్నారు. వందేళ్ల కిందట ఇంత గొప్ప పండుగ సందర్భంగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపన యాదృచ్చికం కాదన్నారు. ఇది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం పునరుజ్జీవనం, ఆ యుగం సవాళ్లను ఎదుర్కోవడానికి ఎప్పటికప్పుడు కొత్త అవతారాల్లో జాతీయ చైతన్యం వ్యక్తమవుతుందని.. ఈ యుగంలో సంఘ్ శాశ్వతమైన జాతీయ చైతన్యం సద్గుణ అవతారమన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..