హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)
పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల విచారణలో భాగంగా బుధవారం ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, కాలె యాదయ్య, గూడెం మహిపాల్రెడ్డిల క్రాస్ ఎగ్జిమినేషన్ జరగనున్నది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ శాసనసభ్యుల తరఫున న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్రాస్ ఎగ్జామినేసన్ ప్రక్రియ కొనసాగనున్నది. బుధవారంతో తొలి దఫా విచారణ కార్యక్రమం ముగియనున్నది. తదుపరి దసరా పండుగ తర్వాత మరికొంతమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ ట్రిబ్యునల్ హోదాలో పిలుస్తారని చెప్తున్నారు. ఈ నెల ఆరో తేదీ తర్వాత స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్తారని అసెంబ్లీ వర్గాలు చెప్తున్నాయి. స్పీకర్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని చెప్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..