హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.)
తెలంగాణ రాష్ట్రంలో మరోసారి బంద్ దిశగా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అడుగులు వేస్తున్నాయి.ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయని నేపథ్యంలో 2025 దసరా పండగ తర్వాత (అక్టోబర్ 6 నుంచి) విద్యా సంస్థలు తెరవొద్దని కాలేజీ యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే విద్యా సంస్థలు బంద్ పై కాలేజీ యాజమాన్యాలు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
ఇటీవల రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక బంద్కు కాలేజీల యాజమాన్యాలు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బంద్ విద్యార్థుల చదువుపై ప్రభావం చూపుతుందని ప్రభుత్వం కాలేజీల యాజమాన్యాలతో చర్చలు జరిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన చర్చలలో కాలేజీల యాజమాన్యాలు వెనక్కి తగ్గాయి. ప్రభుత్వంతో చర్చల అనంతరం దసరా వరకు పెండింగ్లో ఉన్నమొత్తం బకాయిల్లో రూ.600 కోట్లను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు. అయితే డిప్యూటీ సీఎం ప్రకటన చేసి రెండు వారాలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఇంకా బిల్లులను విడుదల చేయలేదు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు