అమరావతి, 1 అక్టోబర్ (హి.స.)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) అధ్యక్షతన అక్టోబర్ 3న వెలగపూడిలోని సచివాలయంలో ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటచేసుకుంది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆ సమావేశాన్ని ఉదయం 11 గంటలకు బదులుగా మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నట్లుగా సీఎస్ విజయానంద్ (CS Vijayanand) ఇవాళ ఓ నోట్ విడుదల చేశారు. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు సమయం మార్పులను గమనించి కేబినెట్ భేటీకి హాజరు కావాలని సీఎస్ ఆ నోట్‌లో పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి