అమరావతి, 1 అక్టోబర్ (హి.స.):రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల) పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 85 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యింది. అత్యధికంగా అనంతపురం, విజయనగరం జిల్లాలో 90 శాతంపైగా పెన్షన్లను అందజేశారు. 63.50 లక్షల మందికి గాను ఇప్పటి వరకు 54.32 లక్షల మంది లబ్ధదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్మును అందజేస్తున్నారు. మరికాసేపట్లో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో పింఛన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపిణీ చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ