హైదరాబాద్, 1 అక్టోబర్ (హి.స.) కేసీఆర్ పాలన గురించి నోరు పారేసుకునే వారికి జాతీయ నేర గణాంక విభాగం నివేదిక చెoపపెట్టు సమాధానమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14వ స్థానానికి పరిమితమైందన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు ఉస్థాయిలో 95.84 శాతం తగ్గాయని చెప్పారు. రైతును రాజును చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి, చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితమని చెప్పారు. కేసీఆర్కు రైతుకు ఉన్నది పేగు బంధం, ఆత్మ బంధం అయితే.. కాంగ్రెస్కు ఉన్నది కేవలం ఓటు బంధం మాత్రమేనని విమర్శించారు.
'2014లో 1347 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, 2023 నాటికి 56కి తగ్గుదల. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14 వ స్థానికి పరిమితం. 2023లో దేశవ్యాప్తంగా 10,786 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా అందులో తెలంగాణ వాటా కేవలం 0.51 శాతం. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో 95.84 శాతం తగ్గుదల. ఇవి మాటలు కాదు, కేసీఆర్ తిరగరాసిన రికార్డులు, కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్న వాస్తవాలు. రైతును రాజు చేయాలన్న కేసీఆర్ సంకల్పానికి, వారు చేసిన నిర్విరామ కృషికి వచ్చిన ఫలితం ఇదంతా!
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు