విజయవాడి, 1 అక్టోబర్ (హి.స.)తనను టెర్రరిస్టులాగా జైల్లో చూశారని... సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో... రెండు రోజుల కిందట జైలు నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి విడుదలైన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే ప్రెస్ మీట్ పెట్టి.. సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ మిథున్ రెడ్డి. తనను జైల్లో... అత్యంత దారుణంగా అధికారులు తనతో వ్యవహరించారని మండిపడ్డారు. తన లాకప్ లో అన్ని కెమెరాలు పెట్టారని సంచలన ఆరోపణలు కూడా చేశారు. తాను జైల్లో ఏది చేసినా... విజయవాడలో చూసేలా ఏర్పాట్లు చేశారని... సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి.
తెలుగుదేశం ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టిందని ఫైర్ అయ్యారు. వేధించడానికి తనపై కేసులు పెట్టారని మండిపడ్డ మిథున్ రెడ్డి.... దేవుడి దయ వల్ల బయటకు వచ్చానని వివరించారు. 73 రోజులపాటు తనను జైల్లో పెట్టారని.. పక్క ఖైదీ తో కూడా మాట్లాడకుండా ఇబ్బందులు పెట్టినట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన గౌరవ కోర్టు తనకు బెయిల్ ఇచ్చిందని గుర్తు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV