అందరి అభీష్టంతోనే అధ్యక్షుల నియామకం: ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా
మెదక్, 12 అక్టోబర్ (హి.స.) ప్రతి ఒక్కరి అభిప్రాయంతోనే అధ్యక్షుని నియామకం ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం డిసిసి అధ్యక్షుడి ఎంపికకు అభిప్రాయ సేకరణ కార్యక్రమం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అధ్యక్ష
ఏఐసీసీ అబ్జర్వర్


మెదక్, 12 అక్టోబర్ (హి.స.)

ప్రతి ఒక్కరి అభిప్రాయంతోనే

అధ్యక్షుని నియామకం ఉంటుందని ఏఐసీసీ అబ్జర్వర్ జ్యోతి రౌతేలా తెలిపారు. మెదక్ జిల్లా కేంద్రంలో ఆదివారం డిసిసి అధ్యక్షుడి ఎంపికకు అభిప్రాయ సేకరణ కార్యక్రమం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అధ్యక్షతన పీసీసీ కోఆర్డినేటర్ అహ్మద్ నసీర్, వరలక్ష్మి, జగదీశ్వర్ రావుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి రౌతేలా మాట్లాడుతూ.. అన్ని రాష్ట్రాల్లో ఏఐసీసీ సూచన మేరకు బీసీసీ అధ్యక్షులు నియామకం కోసం ప్రత్యేక అబ్జర్వర్లను నియమించడం జరిగిందన్నారు. నియమించిన కమిటీ ఆయా మండల, బ్లాక్, జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గాలు బ్లాక్ స్థాయిలో కార్యకర్తల సమావేశం నిర్వహించి అభిప్రాయ శాఖను తీసుకుంటున్నట్లు వెల్లడించారు. డీసీసీల నియామకంలో పారదర్శకంగా పార్టీ కోసం పని చేసే వారికి అవకాశం కల్పిస్తున్నామని వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande