సూర్యాపేట, 12 అక్టోబర్ (హి.స.)
నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి
ముందుకు సాగిన మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి అందరికీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొనియాడారు. ఈ క్రమంలో ఆయన తన ఆరోగ్యం, వయసును సైతం లెక్కచేయకుండా తాను చేపట్టిన పాదయాత్రలో కూడా పాల్గొన్నారని ఆయన గుర్తు చేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం జరిగిన స్వర్గీయ దామోదర్ రెడ్డి సంతాప సభలో పాల్గొని ప్రసంగించారు. అంతకుముందు ఆయన మృతి చాలా బాధాకరంతో పాటు చింతిస్తున్నానని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయన మృతి దురదృష్టకరమని పేర్కొంటూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
దామోదర్ రెడ్డి జీవితమంతా ప్రజా శ్రేయస్సు కోసమే సాగిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న, అధికారపక్షంలో ఉన్న ఆయన ప్రజల పక్షాన్నే నిలిచారని కొనియాడారు. యువత రాజకీయాల్లోకి రావడానికి దామోదర్ రెడ్డి ఒక స్ఫూర్తిదాయకమని స్పష్టం చేశారు. ముఖ్యంగా తుంగతుర్తి నియోజకవర్గంలో విపత్కరమైన రాజకీయాలు ఉన్నప్పటికీ సమన్వయంతో ముందుకు సాగే వారని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు