అమరావతి, 12 అక్టోబర్ (హి.స.)
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మరోసారి అగ్ని ప్రమాదం సంభవించింది. కోకోవెన్ బ్యాటరీ-5లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. లాడీల్ నుంచి ఉక్కు ద్రావకాన్ని తరలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా అది లీకై నేలపాలైంది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తమై అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది తక్షణమే చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. సకాలంలో స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఈ ఘటనలో యంత్ర సామగ్రికి గణనీయమైన నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వా
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ