సంగారెడ్డి, 12 అక్టోబర్ (హి.స.)
పోలియో మహమ్మారిని తరిమి
కొట్టేందుకు ప్రభుత్వాలు ప్రజలను చైతన్యవంతం చేస్తూ 5 సంవత్సరాల లోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేస్తున్నారు. అయితే అధికారుల నిర్లక్ష్యం, సమన్వయం లోపంతో సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బంధం కొమ్ము బస్తీ దవాఖానలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల సెంటర్లో కొన్ని గంటల వ్యవధిలో స్టాక్ ఔట్ అని చెప్తున్నారు. క్యూ లైన్లలో పెద్ద ఎత్తున పిల్లల తల్లిదండ్రులు వేచిచూస్తున్న సిబ్బందిలో చలనం లేకుండా స్టాక్ అయిపోయిందని తాము ఏమి చేయలేమంటూ చేతులెత్తేశారు. దీంతో అధికారుల తీరు పై పేరెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్టాక్ అయిపోయిందని చెప్పడం ఏంటని దగ్గరలో ఉన్న సెంటర్లో నుంచి పోలియో చుక్కల స్టాక్ని ఏర్పాటు చేయాల్సిన అవకాశం ఉన్న బాధ్యత రహితంగా సమాధానం చెప్పడం పట్ల పేరెంట్స్ వైద్యాధికారుల తీరు పట్ల ఆగ్రహం చెందారు . ఈ విషయాన్ని సంగారెడ్డి డీఎంహెచి దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తే కీలకమైన సమయంలో ఆమె ఫోన్కు స్పందించడం లేదని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు