14న తెలంగాణ బంద్.. బీసీ సంఘాల పిలుపు
నాగార్జునసాగర్, 12 అక్టోబర్ (హి.స.) బీసీ సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా బంద్ విజయవంతం చేయాలని బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్. కృష్
బంద్


నాగార్జునసాగర్, 12 అక్టోబర్ (హి.స.)

బీసీ సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 14న రాష్ట్రవ్యాప్తంగా బంద్ విజయవంతం చేయాలని బీసీ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో బీసీ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టనున్నాయి. నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్లో బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం నిర్వహించి, బంద్ పిలుపుకు మద్దతు తెలపాలని నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా చొరవ చూపాలని కోరారు. బంద్ రోజున నందికొండ మున్సిపాలిటీలోని వ్యాపార సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా మూసివేయాలని పిలుపునిచ్చారు. నాగార్జునసాగర్ బీసీ కుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రజలందరూ బంద్ విజయవంతం చేయాలని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande