వరంగల్, 12 అక్టోబర్ (హి.స.)
పిల్లలు పోలియో బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమంలో ఆదివారం నగర మేయర్ గుండు సుధారాణి, చైర్మన్ ఇనగాల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్లతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 0-5 ఏళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం అనేది మన దేశ ఆరోగ్య రంగంలో ఒక ఎంతో ముఖ్యమైన కార్యక్రమమని, పోలియో రహిత దేశంగా మార్చేందుకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాయని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు